హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సైపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

PLD: శావల్యాపురం ఎస్సై వెంకటేశ్ బాబుపై మహిళా కమిషన్‌కు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. దుకాణాన్ని ఖాళీ చేయాలని SI బెదిరించి, బలవంతంగా సంతకం చేయించారని సదరు మహిళ ఆరోపించారు. దీనిపై విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్.. ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని పల్నాడు ఎస్పీని ఆదేశించింది.