ELR: పెంచిన రొయ్యల మేత ధరలను వెంటనే తగ్గించి, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్నే భవన్లో ఆయన మాట్లాడారు. వెనామీ రొయ్యల మేత ధర కిలోకు రూ.9, టైగర్ మేత ధర రూ.12 పెంచడం వల్ల రైతులపై భారం పెరిగిందన్నారు. పెరిగిన ధరలతో వెనామీ మేత కిలో రూ.105, టైగర్ మేత రూ.120కు చేరిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రొయ్యల మేత ధరలను తగ్గించాలి: శ్రీనివాస్


