BPT: జిల్లాలోని యద్దనపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో గేదెల దొంగతనం కేసును పోలీసులు ఛేదించి తమ్ములూరి మరియబాబు, పల్లపు నాగతిరుమల్లేశ్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి వివిధ కేసులకు సంబంధించిన10 గేదెలు, రెండు ట్రక్ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని మార్టూరు రూరల్ సీఐ నాగభూషణం, ఎస్‌ఐ రత్నకుమారి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గేదెల దొంగతనంలో ఇద్దరి అరెస్ట్!


