హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

ATP: హనుమ రెడ్డిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మాజీ ఎంపీ తలారి రంగయ్య రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. రైతులకు సకాలంలో, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పంటలకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ ఆందోళనతో అక్కడ భారీగా వాహనాలు నిలిచిపోయాయి.