హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్న మరణవార్త విని తమ్ముడి మృతి

అన్నమయ్య: రాయచోటి మండలం వరిగ గ్రామం శెట్టివాండ్లపల్లెలో విషాదం చోటుచేసుకుంది. బత్తుల వీరనాగన్న (70) మృతి వార్త విని ఆయన తమ్ముడు బత్తుల రామచంద్ర కూడా నిమిషాల వ్యవధిలోనే మృతి చెందారు. అన్నదమ్ముల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.