హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జూదం ఆడుతున్న 12 మంది అరెస్ట్

KDP: మైదుకూరు (M) కేశలింగయ్యపల్లెలో జూదం ఆడుతున్న 12 మందిని అరెస్ట్ చేసినట్లు మైదుకూరు సీఐ రమణారెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి రూ.61,200 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మట్కా, జూదం, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.