ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. సౌదీలోని దమ్మమ్ నుంచి ఢిల్లీ బయల్దేరిన విమానం మరుగుదొడ్లో బెదిరింపు లేఖను సిబ్బంది గుర్తించారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. ఘటనపై అహ్మదాబాద్ విమానాశ్రయ పోలీసులకు ఎయిరిండియా ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఓ సిబ్బంది, ఓ ప్రయాణికుడిని పోలీసులు విచారిస్తున్నారు.
వార్తలు
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు


