W.G: తణుకులో భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ఇరగవరం రోడ్డు కాలనీకి చెందిన భవాని, దుర్గాప్రసాద్‌లకు పదేళ్ల క్రితం వివాహమైంది. ఉపాధి కోసం విదేశాల్లో ఉంటున్న దుర్గాప్రసాద్ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. భార్యపై అనుమానంతో గురువారం అర్థరాత్రి తర్వాత ఘర్షణకు దిగి కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
భార్యపై భర్త కత్తితో దాడి


