హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ముందు బాబులకు అడ్డాగా హాస్టల్ భవనం..!

NLR: ఎంతోమంది విద్యార్థులకు ఆశ్రయమిచ్చి వారు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు దోహదపడిన బాలికల హాస్టల్ నేడు మందుబాబులకు అడ్డాగా మారింది. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రామకృష్ణ నగర్‌లో సుమారు పది సంవత్సరాల క్రితం ఎస్టీ బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో మూతపడింది. దీంతో ఆ ప్రాంగణం మొత్తం పిచ్చి చెట్లతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది.