హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తిమ్మాయపాలెంలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

అన్నమయ్య: చిట్వేల్ మండలం తిమ్మాయపాలెం క్రాస్‌రోడ్డు వద్ద నారాయణమ్మ స్థాపించిన శ్రీ దత్తగిరి నారాయణ తపోవన అభయాంజనేయ స్వామి ఆశ్రమంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.