హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తిశ్రద్ధలతో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

AKP: నక్కపల్లి మండలం సీతంపాలెం గ్రామం శ్రీకృష్ణుని ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తున్నారు. భక్తులు పలువురు ఆలయానికి విచ్చేసి శ్రీకృష్ణుని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, పలువురు పార్టీ నాయకులు దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం ఆలయం వద్ద అన్న సమారాధన ఏర్పాటు చేశారు.