హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు KUలో ఉపాధ్యాయ దినోత్సవం

హనుమకొండ పట్టణంలోని కాకతీయ విశ్వవిద్యాలయం విద్యా కళాశాలలో సెప్టెంబర్‌ 5న ఉదయం 10 గంటలకు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ డా. నల్లాని శ్రీనివాస్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి వీసీ ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథిగా, రిజిస్ట్రార్‌ ఆచార్య వి. రామచంద్రం గౌరవ అతిథిగా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.