హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏసీబీకి చిక్కిన బీట్ ఆఫీసర్

BDK: గుండాల మండలంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. పోడు భూమిలో ట్రెంచ్‌ కొట్టకుండా ఉండేందుకు రైతును రూ.30 వేలు లంచం డిమాండ్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ రవికుమార్‌ను ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. మధ్యవర్తి సాదిక్‌ ఖాన్ ద్వారా నగదు తీసుకుంటుండగా ఇద్దరినీ అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.