హైదరాబాద్: 28°C
తెలంగాణ

కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన యువకుడు

MHBD: తొర్రూరు మండల కేంద్రంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. భార్యాభర్తల మధ్య పంచాయతీతో మహిళ డయల్ 112 కి కాల్ చేసింది. స్పందించిన బ్లూకోర్ట్ కానిస్టేబుల్ బాధితురాలి ఇంటికి వెళ్లిన సమయంలో యువకుడు కానిస్టేబుల్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో గాయపడిన కానిస్టేబుల్ ను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.