JN: మండలం చౌడారం గ్రామంలో కోతుల దాడితో వ్యక్తికి గాయాలైన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సీ కమ్యూనిటీ హాల్ సమీపంలో కనకయ్య బైక్‌పై వెళ్తుండగా కోతులు దాడి చేయడంతో అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో ఆయన ఎడమ చేయి విరిగినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కోతుల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
వ్యక్తిపై కోతులు దాడి.. తీవ్ర గాయాలు


