హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాభావంతో పశుగ్రాసానికి కొరత

అన్నమయ్య: ఒకప్పుడు సమృద్ధిగా లభించిన వరి గడ్డి.. నేడు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నెలకొనడంతో పశుగ్రాసానికి కొరత ఏర్పడింది. వ్యాపారులు నాయిడుపేట నుంచి వరి గడ్డిని లారీల్లో తీసుకొచ్చి పెద్దమండ్యంలో ఒక్కో కట్ట రూ. 230కు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై పశుగ్రాసం పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.