SRCL: చందుర్తి మండల పరిషత్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. వర్షం కురిసిన రోజు కార్యాలయం ఆవరణలో నీరు ఉరవడంతో వివిధ గ్రామాల నుండి కార్యాలయంకు వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయం పై నాచు పట్టడంతో పాటు నీరు బయటకు వెళ్లకపోవడంతో భవనం ఊరుస్తుందని పలువురు పేర్కొంటున్నారు. కార్యాలయం భవనానికి మరమ్మత్తు పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: శిథిలావస్థలో మండల పరిషత్ భవనం


