హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మంచినీటి పైప్ లైన్ లీక్

MNCL: బెల్లంపల్లి 29వ వార్డులో డ్రైనేజీ పనులు చేస్తుండగా జేసీబీ తాకడంతో 28వ వార్డుకు మంచినీరు సరఫరా చేసే పైపులైన్ లీకైంది. దీంతో మురుగునీరు పైపులోకి చేరింది. మంచినీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి లీకేజీకి మరమ్మతులు చేపట్టి నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.