GSLV-F17 ద్వారా EOS-05 ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. జియోసింక్రోనస్ కక్ష్య నుంచి చిత్రాలను అందించే తొలి భారత ఉపగ్రహం ఇదేనని, ఇది దేశానికే గర్వకారణమని ఆయన ప్రశంసించారు. ఇస్రో, భారత ఇండస్ట్రీ మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం మన అంతరిక్ష రంగానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు.
వార్తలు
'దేశానికే గర్వకారణం'..ఇస్రోపై ప్రధాని ప్రశంసలు


