హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

SRCL: చందుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం ఎదుట గల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదాకరంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుండి పనులపై వాహనదారులు వస్తుంటారు. దారి ప్రక్కనే ఎలాంటి రక్షణ కవచం లేక ట్రాన్స్‌ఫార్మర్ ఉండడంతో భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.