హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారులకు కనీస సౌకర్యాలు కరువు

ASF: కౌటాల మండలం ముత్తంపేట మోడల్ అంగన్వాడీ సెంటర్ లో చిన్నారులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీ నిధులతో నిర్మించిన మరుగుదొడ్డి పైకప్పుపై పిచ్చి మొక్కలు పెరిగి నిరూపయోగంగా మారిందన్నారు. కేంద్రంలో చిన్నారులకు కనీస తాగునీటి సౌకర్యం కూడా లేదని వాపోయారు. గ్రామపంచాయతీ, ICDS అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు.