హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాట్‌పుట్‌లో అచ్చంపేట యువకుడి ప్రతిభ

NGKL: అచ్చంపేటకు చెందిన ప్యారసాని వివేక్ వర్ధన్ రాష్ట్ర స్థాయి షాట్‌పుట్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. వరంగల్‌లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచారు. రాష్ట్ర స్థాయిలో నల్లమల ప్రాంతానికి చెందిన యువకుడు సత్తా చాటడంపై క్రీడాకారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ వివేక్ వర్ధన్‌ను అభినందించారు.