హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

HYD: సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్లో కృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని కృష్ణుడిని దర్శించుకుంటున్నారు. జన్మాష్టమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.