హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురాతన మెట్లబావికి చారిత్రక శోభ

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని సిద్ధరామేశ్వరాలయంలో ఉన్న 400 ఏళ్ల నాటి మెట్లబావి ప్రాచీన నిర్మాణ వైభవానికి నిదర్శనంగా నిలుస్తోంది. 17వ శతాబ్దానికి చెందిన ఈ నిర్మాణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాలుగు వైపులా రాతిమెట్లు, విశిష్ట రాతిగదులతో రూపొందించిన ఈ బావి అడుగున భారీ శివలింగం ఉంది. నీటిమట్టం తగ్గితేనే ఈ లింగ దర్శనం సాధ్యమవుతుంది.