హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళా వర్సిటీలో వెదర్ రీసెర్చ్ సెంటర్..!

తిరుపతి: శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో వెదర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు వర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉష్ణోగ్రత, వర్షపాతం, ఆర్ద్రత, వాయు పీడనం, గాలి తదితర వివరాలను నిరంతరం రికార్డు చేయనున్నారు. వాతావరణ మార్పులపై పరిశోధనలకు ఈ కేంద్రం కీలకంగా మారనుంది. ఈ నెలాఖరులోపు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.