హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధికి దూరంగా గాంధీనగర్‌ గ్రామం

BHPL: గోరికొత్తపల్లి మండలంలోని మారుమూల గ్రామం గాంధీనగర్‌ మౌలిక వసతుల కొరతతో సతమతమవుతోంది. పలు సర్వే నంబర్లలోని భూములకు పట్టాలు లేక రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారని స్థానికులు తెలిపారు. గ్రామంలో రహదారులు సరిగా లేక రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.