హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతలపై గిద్దలూరు ఎమ్మెల్యే విమర్శలు

ప్రకాశం: వెలుగొండ జలాల విడుదలను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మండిపడ్డారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మాగుంట కుటుంబానికి పశ్చిమ ప్రకాశం ప్రజలతో సుదీర్ఘ అనుబంధం ఉందని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీరు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు.