హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ

హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ ఇవాళ సమావేశం కానుంది. కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శితో పాటు ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు ఇందులో పాల్గొంటారు. రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, ప్రస్తుత నీటి నిల్వలపై చర్చిస్తారు. వర్షపాతం, ఇరు రాష్ట్రాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.