కీవ్(ఉక్రెయిన్) పర్యటనలో నల్ల సముద్రంలో నౌకల రాకపోకలు, ద్వైపాక్షిక వాణిజ్య వృద్ధిపై విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చించారు. నౌకలపై దాడుల వల్ల ఇంధన, ఎరువులు, ఆహార కొరత ఏర్పడుతోందని.. పలువురు భారత నావికులు మరణిస్తుండటం ఆందోళనకరమని అన్నారు. ఆహార సరఫరాను నిరోధించడం ఆమోదయోగ్యం కాదని, సముద్ర మార్గాల్లో భద్రత కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
‘భారత నావికులు మరణిస్తుండటం ఆందోళనకరం’


