తెలంగాణ
JNTUలో విద్యార్థిపై దాడి..!
HYD: JNTUలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. నిన్న తీజ్ పండుగ వేడుకల సందర్భంగా ఓ విద్యార్థిపై పలువురు దాడి చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత మంజీరా హాస్టల్‌లోనూ విద్యార్థులు పరస్పరం దాడులకు దిగారు. వర్సిటీ గేటు బయటకు వచ్చిన ఇరువర్గాలు కర్రలతో దాడులు చేసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వర్సిటీ గేటు ముందు విద్యార్థులు ధర్నా చేపట్టారు.


