హైదరాబాద్: 28°C
వార్తలు

ఇది యుద్ధాల శకం కాదు: జైశంకర్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అవసరమైన సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పర్యటించిన ఆయన.. అధ్యక్షుడు జెలెన్‌స్కీతో విస్తృతస్థాయి చర్చలు జరిపారు. ఇది యుద్ధాల శకం కాదని, రణరంగంలో ఎటువంటి సమస్యలకూ పరిష్కారం లభించదని ఈ సందర్భంగా జైశంకర్ స్పష్టం చేశారు.