హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండల కేంద్రానికి మంచినీటి కరువు

PPM: జియ్యమ్మవలస కేంద్రానికి వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. బొమ్మిక సమీపంలోని గెడ్డ వద్ద ఉన్న పంపుహౌస్‌ నుంచి నీటి సరఫరా జరుగుతుండగా, ఏళ్ల క్రితం వేసిన పైపులైన్లు దెబ్బతిని లీకులు ఏర్పడటంతో నీరు అందడం లేదని తెలిపారు. అధికారులు పైపులైన్లకు మరమ్మతులు చేసి నీటి సరఫరా చేయాలని కోరుతున్నారు.