హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు అరసవల్లి ఆలయానికి నూతన పాలకమండలి

SKLM: అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి ప్రభుత్వం 12 మంది సభ్యులతో నూతన పాలకమండలిని నియమించింది. ఈ నెల 5న వారు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం నియమించిన కొత్త పాలకమండలి ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై దృష్టి సారించనుందని, ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.