హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూరగాయలతో అమ్మవారికి అలంకరణ

VZM: శ్రావణ శుక్రవారం సందర్భంగా రాజాం పట్టణం డోలపేటలో కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని సుమారు 75 కేజీల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనానికి ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ధర్మకర్తలు వడ్డాది శ్రీనివాసరావు, గోకవలస మహేశ్‌ తెలిపారు.