హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులు నీటిని జాగ్రత్తగా వాడాలి: ఎమ్మెల్యే

ATP: నార్పల(M) బి.పప్పురు గ్రామంలో ఎల్‌నినో ప్రభావం, నీటి లభ్యతపై ఎమ్మెల్యే బండారు శ్రావణి అవగాహన కల్పించారు. గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రచ్చబండ వద్ద నీటి పొదుపు, వ్యవసాయంలో నీటి వృథా నివారణపై మాట్లాడారు. వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు నీటిని జాగ్రత్తగా వాడాలని సూచించారు.