హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనదుర్గా భవాని మాతకు ప్రత్యేక పూజలు

MDK: శ్రావణ శుక్రవారం సందర్భంగా ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని మాత ఆలయం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. అమ్మవారిని నవధాన్యాలు, ప్రత్యేక పుష్పాలంకారణతో దివ్యంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు పవిత్ర మంజీరా నదిలో స్నానాలు ఆచరించి, దర్శనానికి పోటెత్తారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, మౌలిక వసతులు ఏర్పాటు చేశారు.