హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనపర్తి గురుకుల కాలేజీలో ఆకస్మిక తనిఖీ

WNP: రామాలయం సమీపంలోని మైనార్టీ సంక్షేమ గురుకుల కాలేజీని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సిరాజుద్దీన్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పలు రిజిస్టర్లు, హాస్టల్ గదులను పరిశీలించారు. వంటగది, భోజనశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.