భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) EOS-05 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ 'X' వేదికగా ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. 'అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన మరో అతిపెద్ద పేలోడ్ ఇది. ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో భారతదేశ అంతరిక్ష సామర్థ్యాలు సరికొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి' అని పేర్కొన్నారు.
వార్తలు
ఇస్రో శాస్త్రవేత్తలకు జితేంద్ర సింగ్ అభినందనలు


