హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వచ్చి..

VSP: స్నేహితుడి పుట్టినరోజు వేడుకల కోసం వచ్చిన విద్యార్థి మృతి చెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట(M) రావిచంద్రిలో నిన్న జరిగింది. స్నానాల కోసం (కోనేరు) చెరువులో మునిగి మోహనరావు (14) అనే విద్యార్థి మృతి చెందాడు. విశాఖలోని జ్ఞానాపురానికి చెందిన మోహనరావుతో పాటు మరో 20 మంది స్నేహితులు వచ్చారు. 108 వాహనంలో ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.