హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో షీ టీమ్ అవగాహన సదస్సు కార్యక్రమం

KMR: బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్ సభ్యులు అనిల్కుమార్, పార్వతి పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు. గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్, మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాలపై వివరించారు. ఆన్‌లైన్‌లో మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.