హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీఐలో మిగిలిన సీట్లకు ప్రవేశాలు

NTR: విజయవాడ ప్రభుత్వ ITIలో వివిధ ట్రేడుల్లో నాలుగో విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 7న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ ఎం. కనకారావు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంటలోపు ఆన్‌లైన్‌ దరఖాస్తు, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయాలని సూచించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందన్నారు.