KKD: 'ఒక నెల - ఒక నియోజకవర్గం' పర్యటనలో భాగంగా పెద్దాపురం మండల పరిషత్ కార్యాలయంలో సెప్టెంబర్ 5న నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పాల్గొంటారని మండల పరిషత్ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయన స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పెద్దాపురంలో PGRS కార్యక్రమం


