SKLM: పాతపట్నం మేజర్ పంచాయతీలో ఇవాళ, రేపు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పంచాయతీ కార్యదర్శి వి.రామచంద్రరావు తెలిపారు. పంప్ హౌస్ నుంచి ట్యాంకులకు వెళ్లే ప్రధాన పైప్ లైన్ మరమ్మతుల కారణంగా సరఫరా నిలిపివేసినట్లు ఆయన పేర్కొన్నారు. మరమ్మతు పనులు వేగంగా పూర్తి చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తామని, ప్రజలు సహకరించాలని కార్యదర్శి కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు, రేపు త్రాగునీటి సరఫరాకు అంతరాయం


