అన్నమయ్య: నందలూరు మండలం అరవపల్లెలోని శ్రీకృష్ణ గీతా మందిరంలో శుక్రవారం శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీకృష్ణ కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు గోపూజ, 9 నుంచి 10.30 గంటల వరకు కల్యాణోత్సవం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు కుర్రమణి యాదవ్ తెలిపారు. మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, దారం, ముత్యాల తలంబ్రాలు అందజేయడం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
అరవపల్లెలో శ్రీకృష్ణ కళ్యాణ మహోత్సవం


