హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనగామలో హజ్రత్ యాకుబ్ షావలి ఉర్సు వైభవం

జనగామ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో బైపాస్ సమీప దర్గాలో హజ్రత్ సయ్యద్ యాకుబ్ షావలి ఉర్సు ఉత్సవాలు గురువారంరాత్రి ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు సయ్యద్ యాకుబ్ పాషా ఆధ్వర్యంలో గంధం ప్రతిష్ఠించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో సీఐ సత్యనారాయణ రెడ్డి, మైనార్టీ జిల్లా ఛైర్మన్ మాజీద్ అప్సర్‌తో మైనార్టీ నేతలు పాల్గొన్నారు.