హైదరాబాద్: 28°C
తెలంగాణ

తప్పిపోయిన బాలుడిని అప్పగింత

MNCL: తప్పిపోయిన బాలుడిని సురక్షితంగా రామకృష్ణాపూర్ పోలీసులు తల్లిదండ్రులకు చెంతకు చేర్చారు. SI శ్రీధర్ వివరాల ప్రకారం.. అమ్మ గార్డెన్ చౌరస్తాలో గుర్తుతెలియని బాలుడు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందింది. బాలుడిని స్టేషన్ తీసుకువచ్చి వివరాలు అడిగి, మందమర్రికి చెందిన వాడిగా గుర్తించారు. తల్లిదండ్రులను పిలిపించి బాలుడిని క్షేమంగా అప్పగించారు.