హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్‌ యాదవ్‌పై రెండేళ్ల నిషేధం

బెంగాల్‌కు చెందిన భారత అండర్‌-19 క్రికెటర్‌ రోహిత్‌ యాదవ్‌పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించింది. వయస్సు ధ్రువీకరణలో పదేపదే పుట్టిన తేదీని మార్చినట్లు గుర్తించింది. 2014లో ఒక తేదీ, 2017లో మరో తేదీ, 2021లో మళ్లీ భిన్నమైన తేదీని ఆధార్‌లో నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికైన అతడికి గట్టి షాక్ తగిలింది.