హైదరాబాద్: 28°C
వార్తలు

రాజకీయ కక్షతోనే ఓటు తొలగింపు: రాఘవ్‌ చద్దా

పంజాబ్‌లో చేపట్టిన SIRలో తన పేరును ఓటరు జాబితా నుంచి తొలగించడంపై ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు. ఇది రాజకీయ కక్షలో భాగమేనని మండిపడ్డారు. శాశ్వతంగా వలస వెళ్లినవారిగా పేర్కొంటూ మొహాలీ ఓటరు జాబితా నుంచి తన పేరు తొలగించారని అన్నారు. ఇది సాధారణ పొరపాటు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇది ముసాయిదా జాబితా మాత్రమే అని, దీనిపై తాను అభ్యంతరాలు తెలియజేస్తానని ఆయన వెల్లడించారు.