E.G: సార్వా వరి పొలాల్లో ఎలుకల నియంత్రణపై రైతులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు సూచించారు. పంట పిలకల దశలో ఉండటంతో ఎలుకల వల్ల నష్టం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పొలాలను పరిశీలించి నివారణ పద్ధతులను వివరించారు. ఎలుకల మందు వినియోగం, ఎర బుట్టల ఏర్పాటు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం అవసరమైన మందు పొట్లాలను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'సార్వా వరికి ఎలుకల ముప్పు'


