హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీజే నిర్వాహకులతో పోలీసుల సమావేశం

ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో డీజే నిర్వాహకులు, సౌండ్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ, ఎస్సై సుధాకర్‌లు మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం నిర్ణీత డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దంతో డీజేలు మోగించడం నేరమన్నారు. వేడుకలు, ఊరేగింపుల్లో సౌండ్ సిస్టమ్స్ వాడటానికి పోలీసుల అనుమతి తప్పనిసరన్నారు. డీజేల కంటే సంప్రదాయ వాయిద్యాలను వాడాలన్నారు.